ఊరంతా అనుకుంటున్నారు తెలుగు ఫ్యామిలీ మూవీ

తెలుగుమూవీస్ ఫ్యామిలీ మొత్తం చూడదగిన మూవీస్ గా కొన్ని మూవీస్ ఉంటాయి. వాటిలో ఊరంతా అనుకుంటున్నారు తెలుగు ఫ్యామిలీ మూవీ కూడా ఒక్కటి.

నవీన్‌ విజయ్‌ కృష్ణ, మేఘానా చౌదరి, శ్రీనివాస్‌ అవసరాల, సోఫియా సింగ్‌ హీరోహీరోయిన్లుగా, బాలాజీ సానల దర్శకత్వంలో ఊరంతా అనుకుంటున్నారు తెలుగు మూవీ వచ్చింది.

ఇంకా ఊరంతా అనుకుంటున్నారు తెలుగుమూవీలో జయసుధ, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ తదితరులు నటించారు. ఊరంతా మంచి జంటగా ఒప్పుకుంటే పెళ్లి చేసుకునే కాన్సెప్టుతో ఈ మూవీ ఉంటుంది.

వివాహం విషయంలో ఎవరికెవరు అని పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు, కానీ ఈ తెలుగుమూవీలో మాత్రం పెళ్లి ఊరి జనమంతా నిర్ణయిస్తారు. ఎందుకంటే?

మహేష్ – గౌరిలు ఒకరికోసం ఒకరు అని వారికి పెళ్లి చేయాలని పెద్దలతోబాటు ఊరంతా అనుకుంటుంది. మహేష్ ఊరిలో పెద్దమనిషి అయిన లీలావతి మనవడు, అయితే లీలావతి ఇంట్లో మహేష్ – గౌరిలకు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు.

నందమూరి తారకరామారావు గారు నటించిన తెలుగుమూవీస్ లిస్టుకోసం ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన తెలుగుమూవీస్ లిస్టుకోసం ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

పెళ్లి చూపులలో మాట్లాడుకోవడం కోసం పొలాల్లోకి బయలుదేరిన మహేష్ – గౌరీలో ఇద్దరూ వేరు వేరు వ్యక్తులను ప్రేమిస్తున్న విషయం ఒకరికొకరు చెప్పుకుని, ఆ విషయం ఇంట్లో పెద్దలకు చెప్తారు.

అయితే ఇది ఊరి మంచి కోసం ఊరంతా అనుకునే జంటకు వివాహం చేయడం చాలా ఏళ్ళుగా ఆచారంగా వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ విషయంలో మీరు ప్రేమిస్తున్న వ్యక్తులను ఊరిలోకి తీసుకురండి. అప్పుడు ఊరంతా ఏమి అనుకుంటే అదే జరుగుతుంది, అని ఊరి పెద్దలు నిర్ణయిస్తారు.

అప్పుడు మహేష్ తను ప్రేమిస్తున్న, మాయను అమె ఫ్యామిలిని ఊరికి రప్పిస్తే, గౌరి తను ప్రేమిస్తున్న అయ్యర్, అతని ఫ్యామిలిని ఊరికి రప్పిస్తుంది. ఊరంతా ఆ రెండు జంటల గురించి చెప్పుకుంటారు. ఆ రెండు జంటలలో తాము ప్రేమించిన వ్యక్తుల తమను సరైనా జోడినా? లేక ఊరంతా అనుకుంటున్నారు అనే జోడి సరైనదా? ఇదే ఈ తెలుగుమూవీ కధ.

ప్రేమించుకుని లేచిపోవడం కాకుండా ప్రేమించినవారిని ఇంట్లోవారికి పరిచయం చేయడం ఒకప్పటి సినిమాలలో ట్రెండు అయితే, ఈ సినిమాలో ప్రేమించిన వారిని ఊరికి పరిచయం చేయడం, ఊరి పెద్దలు పెట్టిన పరీక్షలలో పాస్ అవ్వడం అనేది వెరైటీ.

చిన్న హీరోల తెలుగుమూవీ అయినా కధనం ఆసక్తిగానే సాగుతుంది. ఊరంతా పెళ్లి జంటను నిర్ణయించడం అనే పాయింటులో రెండు జంటలు ఆలోచనలు, ఊరి పెద్దలు ఆలోచనలు చక్కగా ఈ తెలుగుమూవీలో చూపించారు. పల్లెటూరి కట్టుబాట్లతో ఒకరికోసం ఊరంతా ఎలా ఆలోచన చేస్తుందో కూడా చక్కగా చూపించారు.

పల్లెటూరి వాతావరణంలో ఊరంతా అనుకుంటున్నారు తెలుగు ఫ్యామిలీ మూవీ సాగుతుంది. కాలక్షేపం కోసం సంప్రదాయం, పల్లెటూరి వాతావరణ: గురించి తెలియజేసే తెలుగుమూవీస్ చూడడం వలన వాటిపై మక్కువ ఎక్కువ అవుతుంది అంటారు.

ఊరంతా అనుకుంటున్నారు తెలుగు ఫ్యామిలీ మూవీ

ధన్యవాదాలు – మూవీమిత్ర

మల్లీశ్వరి కాసేపు కాలక్షేపం కోసం కామెడిగా…

మల్లీశ్వరి రెండు తెలుగుమూవీస్ ఉన్నాయి. పాతది ఎన్టీఆర్, భానుమతిలు నటించారు. రెండవది వెంకటేష్, కత్రినాకైఫ్ నటించారు. ఇప్పుడు కామెడి తెలుగమూవీలలో భాగంగా మనం వెంకటేష్, కత్రినాకైఫ్ కలిసి నటించిన మల్లీశ్వరి తెలుగుమూవీ గురించి తెలుసుకుందాం. మల్లీశ్వరి కాసేపు కాలక్షేపం కోసం కామెడిగా…

ఎలాంటి మూవీస్ చూస్తే అలాంటి ఆలోచనలతో మనసు కలిగి ఉంటుంది. ఎటువంటి బుక్స్ చదివితే అటువంటి ఆలోచనలు అంటారు. మూవీస్ విషయంలో కామెడి మూవీస్ చూస్తూ కాసేపు సాదారణ ఆలోచనల నుండి మనసుకు విరామం ఇవ్వమంటారు. కాలక్షేపం కోసం కామెడిమూవీస్ చూడడం కొందరికి అలవాటుగా ఉంటుంది. మల్లీశ్వరి సరదాగా సాగే కామెడి మూవీగా ఉంటుంది.

విశాఖపట్నంలో ప్రసాద్ ఒక బ్యాంకు ఉద్యోగి అయితే అతని వయస్సు ఎక్కువ అయినా పెళ్లి కాలేదు కాబట్టి అతనిని పెళ్ళికాని ప్రసాద్ గా పిలుస్తారు. ప్రసాద్ అన్నయ్య, వదినలు చూసిన ప్రతి సంబంధం ఫెయిల్ అవుతూ ఉంటుంది. బ్యాంకులోకి ఏపని మీద ఎవరైనా మహిళలు వస్తే, ఆమెకు పెళ్లికాకుండా ఉంటే, సరదాగాను, అమెకు పెళ్ళి అయ్యి ఉంటే చిరాకుగానూ మాట్లాడేస్తూ, పెళ్లికోసం కలలు కంటూ ఉంటాడు.

ఇక హీరోయిన్ పాత్ర మల్లీశ్వరీ మీర్జాపురం సంస్థానానికి ఏకైక వారసురాలు. అందమైన అమ్మాయి అయితే ఆమె ఆస్తిపై కన్నేసినవారు ఆమెపై హత్యాయత్నం చేస్తారు. దాంతో మల్లీశ్వరి తాతయ్య ఆమెను విశాఖపట్నం మల్లీశ్వరి బాబాయిగారి ఇంటికి పంపించేస్తారు.

వైజాగ్ వచ్చిన మల్లీశ్వరి, పెళ్ళికాని ప్రసాద్ కంట్లో పడుతుంది. అతను ఆమె వెనకాల పడతాడు. ఒకరోజు మల్లీశ్వరిపై వైజాగ్లో కూడా హత్యాయత్నం జరగబోతే ఆమెను కాపాడి హైదరాబాద్ తీసుకువెళతాడు. అక్కడకు వెళ్ళాక మల్లీశ్వరి ఐశ్వర్యవంతురాలు అని అర్ధం చేసుకుని, తన పెళ్ళి ఆలోచనను విరమించుకుంటాడు. అయితే మల్లీశ్వరిపై జరిగిన హత్యాయత్నంలో వివరాల కోసం, మల్లీశ్వరి తాతగారి కోరికపై అతను మల్లీశ్వరి ప్యాలెస్ లోనే ఉంటాడు.

అక్కడ కూడా మల్లీశ్వరిపై జరిగిన హత్యా ప్రయత్నములను పెళ్లికానీ ప్రసాద్ భగ్నం చేస్తాడు. ఈ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి వార్నింగు కూడా ఇచ్చి వస్తాడు. చివరికి మల్లీశ్వరి కోట్ల ఆస్తిని వదిలేసుకుని, పెళ్ళికాని ప్రసాద్ వెనుక వైజాగ్ వచ్చేస్తుంది.

ఈ మల్లీశ్వరి తెలుగుమూవీకి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అంతా కామెడిగానే సరదాగా సాగుతుంది. ఈ మూవీలో నరేష్, వెంకటేష్, కత్రినా కైఫ్, సునీల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, గజాలా, స్మిత, ఆహుతి ప్రసాద్, చిత్రం శ్రీను, హేమ, బెనర్జి, వల్లభనేని జనార్ధన్ తదితరులు నటించారు.

మల్లీశ్వరి కాసేపు కాలక్షేపం కోసం కామెడిగా… సరదాగా సాగే సన్నివేశాలలో వెంకటేష్, సునీల్, బ్రహ్మానందం నటన ఆకట్టుకుంటుంది. ఈ తెలుగుమూవీలోని పాటలు కూడా ఆకట్టుకుంటాయి.

మల్లీశ్వరి కాసేపు కాలక్షేపం కోసం కామెడిగా…

ధన్యవాదాలు – మూవీమిత్ర

రెడీ

తెలుగు దర్శకుడు శ్రీనువైట్ల యాక్షన్, కామెడిని మిక్స్ చేసి మూవీస్ తీయడంలో దిట్ట. అది అగ్రహీరో అయినా చిన్న హీరో అయినా కామెడి, యాక్షన్ రెండూ ఉండి ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఇలా రామ్ తెరకెక్కించిన తెలుగుమూవీ రెడీ అదే కోవలోకి వస్తుంది.

స్రవంతి రవికిషోర్ నిర్మించిన రెడీ తెలుగుమూవీలో రామ్, జెనిలీయ డిసౌజా, సునీల్, చంద్రమోహన్, నాజర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరని, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, విద్య తదితరులు నటించారు.

రఘుపతి (నాజర్), రాఘవ(తనికెళ్ళ భరణి), రాజారాం(వెంకట గిరిదర్) ముగ్గురు అన్నదమ్ములు. వారికి స్వరాజ్యం(రజిత) చెల్లెలు, ఆ చెల్లెలి స్వరాజ్య భర్త (చంద్రమోహన్), అతను ఇల్లరికం వచ్చి రఘుపతి ఫ్యామిలిలోనే ఉంటాడు. రఘుపతి తమ్ముడు రాఘవ సుపుత్రుడు చందు (రామ్). చందు మరదల స్వప్నకు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుండగా, ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేకపోడంతో, ఆమె ప్రేమించిన వ్యక్తి(నవదీప్) వద్దకు ఆమెను చేరుస్తాడు. పెళ్లి చెడగొట్టినందుకు రఘపతి చందుని ఇంటి నుండి వెళ్లగొడతాడు.

ఆ తర్వాత చందు తన స్నేహితుడు ప్రియురాలికి పెళ్లి జరుగుతుంటే, ఆమెను కిడ్నాప్ చేయబోయే వేరే పెళ్ళికూతురు పూజని కిడ్నాప్ చేస్తాడు. పూజ కూడా తనకు ఇష్టంలేని పెళ్లి నుండి తప్పించుకోవాలనకుని, అనుకోకుండా ఇలా కిడ్నాప్ అవ్వడంతో, ఆమె చందు ఇంట్లో ఉంటుంది. చందు కూడా రఘుపతి అనుమతితో మరలా ఇంట్లోకి చేరతాడు. ఆ ఇంట్లో వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి పూజ మేనమామల కొడుకులు ఇద్దరూ ఎదురుచూస్తూ ఉంటారు. పూజ కోసం గాలిస్తూ ఉంటారు.

పూజ తన మేనమామల దగ్గరకు వెళ్లవలసి రావడంతో, చందు పూజకోసం వారి మేనమామల ఇంట్లోకి, వారిద్దరికీ జాయింట్ ఎక్కౌంటెంటు (బ్రహ్మానందం) ద్వారా చేరతాడు. చివరికి పూజ ఇద్దరి మేనమామల అంగీకారంతో పూజని చందు వివాహం చేసుకుంటాడు.

ఈ రెడీ మూవీ కామెడితో సరదాగా సాగిపోతుంది.

రెడీ తెలుగు కామెడీ ఎంటర్ టైనర్ మూవీ

ధన్యవాదాలు – మూవీమిత్ర

హనుమాన్ జంక్షన్

యాక్షన్ హీరో అర్జున్, జగపతిబాబు నటనతో బాటు వేణు, ఎల్బీశ్రీరాంలతో కూడిన కామెడి సన్నివేశాలు మూవీని తీక్షణంగా వీక్షించడంలో మునుగుతాం. స్నేహం, ప్రేమ ప్రధానంగా కామెడి సన్నివేశాలతో హనుమాన్ జంక్షన్ తెలుగుమూవీ చక్కగా ఉంటుంది.

హనుమాన్ జంక్షన్ తెలుగుమూవీకి రాజా ఎం దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో జగపతిబాబు, అర్జున్, వేణు తొట్టెంపూడి, లయ, స్నేహ, విజయలక్ష్మి, కోవై సరళ, బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ, కైకాల సత్యనారాయణ, ఆలీ, తదితరులు నటించారున్.

బాల్యం నుండి మంచిమిత్రులుగా ఉండే కృష్ణ(అర్జున్), దాసు(జగపతిబాబు) హనుమాన్ జంక్షన్ లో ఎంత చెబితే అంత. చిన్నప్పటి నుండి కష్టపడి కెడి అండ్ కో కంపెనీ స్థాపిస్తారు. కృష్ణ అండ్ దాస్ కంపెనీలోకి శత్రు మేనేజరుగా జాయిన్ అవుతాడు. హనుమాన్ జంక్షన్లో కెడి అండ్ కో జరిపించే ఉత్సవాలలో పాల్గొనడానికి వచ్చిన సంగీత, వారి కోపానికి గురి అవుతుంది. సంగీత కుటుంబం నుండి గెంటివేయబడడంతో, ఆమె ఆత్మహత్య చేసుకోబోవడంతో, ఆమెను కృష్ణ, దాసులు కాపాడి తమ ఇంటికి తీసుకువెళతాడు. కృష్ణ, దాసులకు బద్ద శత్రువు అయిన దేవుడయ్య కూతరు మీనాక్షి కృష్ణను చిన్నప్పటి నుండి ఇష్టపడతుంది. కృష్ణకు కూడా మీనాక్షి అంటే ఇష్టము అయితే సంగీత అంటే దాసుకు ఇష్టము. కానీ కొన్ని పరిణామాల వలన సంగీతకు కృష్ట అంటే, దాసుకు మీనాక్షి మీద ఇష్టం పెంచుకుంటారు. ఈ కన్ఫూజన్లో వేణు సూత్రధారి అవుతాడు. దేవుడయ్య ఇదే కన్ఫూజన్ అడ్డుగా పెట్టుకుని కృష్ణ, దాసులపై ప్రతికారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ కన్ఫూజన్ డ్రామాలో కామెడి కలిసి, హనుమాన్ జంక్షన్ మూవీ కామెడి జంక్షన్ గా ఉంటుంది.

ధన్యవాదాలు – మూవీమిత్ర

బెండు అప్పారావు

అల్లరి నరేష్ ఒక ఆర్ఎంపి డాక్టరుగా అల్లరి చేస్తే అది బెండు అప్పారావు తెలుగుమూవీ అందరిని నవ్వించడంలో విజయవంతం అయిన మూవీగా పేరుతెచ్చుకుంది. ఈ మూవీకి కూడా ఈవివి సత్యనారాయణ డైరక్షన్ వహించారు.

బెండు అప్పారావు తెలుగుమూవీలో అల్లరి నరేష్, కామ్నా జఠ్మలానీ, మేఘన, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, కొండవలస లక్ష్మణరావు, కృష్ణ భగవాన్, ఎల్.బి.శ్రీరామ్, శ్రీనివాస రెడ్డి, సుమన్ శెట్టి తదితరులు నటించారు.

అప్పారావు ఊరిలో జనాలకు వైద్యం చేస్తూ, వచ్చిన డబ్బును తన చెల్లెలి కాపురం సరిదిద్దడానికే దారపోస్తూ ఉంటాడు. అప్పారావు ఆ ఊరి రాజుగారి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈలోపు డబ్బు ఆశ ఎక్కువగా ఉన్న అప్పారావు బావ, తన భార్యను పుట్టింటికి పంపించేస్తాడు. అప్పారావు స్నేహితులు అప్పులతో సతమతం అవుతారు. అప్పుడే వారికి ఒక అపరిచిత వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బును అప్పజెప్పి చనిపోతాడు. ఆ డబ్బును అతని బంధువులకు అప్పజెప్పడానికి అప్పారావు చేసిన ప్రయత్నం ఫలించకపోడంతో, ఆ డబ్బులో కొంత భాగం అప్పారావు, స్నేహితులు పంచుకుని మిగిలిన డబ్బుతో ఆ ఊరిలో మంచి పనుల చేయిస్తాడు, అప్పారావు. అయితే ఆ డబ్బును అందించిన వ్యక్తి తాలుకా బంధువులు తిరిగి రావడంతో అప్పారావు తన ప్రేమను సైతం వదులుకోవడానికి సిద్దపడతాడు.

ధన్యవాదాలు – మూవీమిత్ర

పెళ్ళి పుస్తకం

జీవితం ఒక పుస్తకం అయితే పెళ్లి అనేది ప్రధాన అధ్యాయం అంటారు. అలా పెళ్ళి ఒక పుస్తకం అయితే భార్యభర్తల మద్య సంఘటనలు మరుపురాని అధ్యాయాలు అవుతాయి అంటారు. అయితే ఆ సంఘటనలు సందేహం వచ్చేవి అయితే జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో ఈ పెళ్ళిపుస్తకం తెలుగుమూవీలో చూడవచ్చు.

ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకమే పెళ్లి పుస్తకంలో కధానాయిక, ఆ కధానాయిక నడిపించే కధలో వధూవరులు ప్రధాన పాత్రలు, వారికి సహాయకంగా మరిన్ని పాత్రలు. పెళ్ళిపుస్తకం తెలుగుమూవీలో రాజేంద్రప్రసాద్, దివ్యవాణి, సత్యభామ, గుమ్మడి వేంకటేశ్వరరావు, సింధూజ, శుభలేక సుధాకర్, ఝాన్సీ, రావి కొండలరావు, రాధాబాయి, అనంత్, సాక్షి రంగారావు, ధర్మవరపు సుబ్బారావు తదితరులు నటించారు.

బాపు దర్శకత్వం వహించిన పెళ్ళిపుస్తకం తెలుగుమూవీలో దివ్యవాణి బొమ్మలాగా కదులుతుంది. కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులిద్దరికీ కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అందువలన ఇద్దరూ ఉద్యోగం చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇద్దరికీ వివాహం కాలేదన్న షరతుతో ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేయవలసి వస్తుంది. వారి మద్యలో మరో ఇద్దరు ప్రవేశించడంతో ఇద్దరి మద్య దూరం పెరిగి, చివరికి అందరి మద్యలో ఒక్కటవుతారు.

ఒక క్లాసికల్ కామెడి మూవీగా పెళ్ళిపుస్తకం మూవీ ఉంటుంది.

ధన్యవాదాలు – మూవీమిత్ర

కితకితలు

1990వ దశకంలో అగ్రదర్శకులలో ఒకరైన ఈవివి సత్యనారాయణ కామెడి మూవీస్ తెరకెక్కించడంలో సిద్దహస్తులు. ఈయన దర్శకత్వంలో వచ్చిన కామెడి తెలుగు మూవీస్ తెలుగువారిని బాగా ఆకట్టుకునేవి. ఈవివి దర్శకత్వంలో వచ్చిన కితకితలు తెలుగుమూవీ టైటిల్ కు తగ్గట్టుగానే కామెడిని అందిస్తుంది. ఇంకా ఈ తెలుగుమూవీలో హీరో ఈయన తనయుడే.

కితకితలు తెలుగుమూవీలో అల్లరి నరేష్, మధు శాలిని, గీతా సింగ్, సునీల్, బ్రహ్మానందం, లక్ష్మీపతి, గిరిబాబు, జయప్రకాశ్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, రఘుబాబు, వేణుమాధవ్, ఆలీ తదితరులు నటించారు.

సాదారణ యువకుడికి ఉండే కలలు మాదిరిగానే తనకు కాబోయే భార్యవిషయంలో కొన్ని కలలను కన్న యువకుడుకి, ఆకలలకు వ్యతిరేకంగా వివాహం జరిగితే, అప్పుడు ఆ యువకుడు వేరొక అమ్మాయికోసం ప్రాకులాడితే, పరిచయమైన అమ్మాయి కేవలం డబ్బు మనిషని, తనతో తాళి కట్టించుకున్న భార్య తనమేలును మాత్రమే కాక్షించే ఇల్లాలిగా ఈ కితకితలు తెలుగుమూవీలో దర్శకుడు కామెడిగా తెలియజెప్పడం ఈ మూవీ విశేషం.

తెలుగు మూవీలో బక్కగా ఉండే కుర్రవాడికి, బండగా ఉండే భార్య లభిస్తుంది. ఆ బక్కకుర్రాడిపేరు రాజబాబు, అతని అర్ధాంగి పేరు సౌందర్య. కానీ రాజబాబు లావుగా ఉన్న తనభార్యను తన తోటి ఉద్యోస్తులకు కూడా పరిచయం చేయడు. ఇంకా రంభ అనే అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. అయితే సౌందర్య మాత్రం భర్తని మనసారా ఆరాధిస్తుంది. సౌందర్య నుండి రాజబాబు విడిపోయి రంభను పెళ్లి చేసుకోడానికి చేసే ప్రయత్నంలో ఉంటే, సౌందర్య తన భర్తలో మార్పుకోసం ప్రయత్నిస్తుంది. కితకితలు తెలుగు కామెడి మూవీలో కామెడితో బాటు భార్యభర్తల మద్య అందం అంటే మనసులు కలవడం కానీ శరీరాకృతి కాదు అనే సందేశం కూడా ఉంటుంది.

కితకితలు

ధన్యవాదాలు – మూవీమిత్ర

అప్పుల అప్పారావు పుల్ లెంగ్త్ కామెడిమూవీ

అప్పులేనివారు ఉండరంటారు, అప్పు అంతటి కామన్ పాయింట్ అందరికీ అయినప్పుడు ఆ అప్పు మీద కామెడి చేస్తే మరింత మెప్పు పొందవచ్చును. అప్పుల అప్పారావు మూవీ టైటిల్ తగ్గట్టుగానే అప్పుల అప్పారావు పుల్ లెంగ్త్ కామెడిమూవీ ! అప్పులతో బ్రతికేసే అప్పారావు కధతో తెలుగుమూవీ ఉంటుంది. ఈ తెలుగుమూవీ కామెడితో మిత్రునివలె నవ్విస్తూ ఉంటుంది.

అప్పుల అప్పారావు తెలుగుమూవీలో కామెడి హీరో రాజేంద్రప్రసాద్, శోభన జంటగా నటించగా ఈవివి సత్యనారాయణతెలుగుమూవీకి డైరక్షన్ చేశారు.

అప్పారావు నిద్రలేచిన దగ్గరి నుండి పడుకునేవరకు అన్ని అప్పులే. అలా అందరి దగ్గరా అప్పులు చేస్తూ, అప్పుల వాళ్ళతో ఇంటి ముందు క్యూకట్టించుకునే స్థాయిలో అప్పారావు అప్పులు ఉంటాయి.

అలాంటి అప్పుల అప్పారావుకు ఒక లేడి కానిస్టేబిల్ కు ప్రేమ పుడుతుంది. అయితే వారి ప్రేమకు పెళ్ళి సెంటిమెంటు అడ్డువచ్చి మొదటి భార్య పోతుందనే బ్రమతో, చావుబ్రతుకుల్లో ఉన్న వేరొక యువతి మెడలో అప్పారావు తాళి కడతాడు. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో, తాను మోసపోయినట్టు శోభనం రోజునే అప్పారావుకు తెలుస్తుంది.

ఆ విషయం అత్తగారిని నిలదీయడంతో, ఆమె తప్పనిసరి పరిస్థితులలో ఆపని చేసినట్టుగా చెబుతుంది. ఆ మోసపు పెళ్ళి తప్పించుకోవడానికి అప్పారావు తన మరదళ్లకు పెళ్ళిళ్లు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అప్పారావు తన మరదళ్లకు పెళ్ళిళ్ళు చేస్తే, ఆ మోసపు వివాహం రద్దు చేసుకందామనే అంగీకారం అప్పారావు, అత్తగారితో ఒప్పందం కుదుర్చుకుంటాడు.

అప్పారావు ఏవిధంగా తన మరదల పిల్లలకు వివాహం చేశాడు అనే అంశంతో ఈ మూవీ కామెడితో సాగుతుంది. కేవలం వినోదం కోసమో మూవీక్షణ చేసేవారికి అప్పుల అప్పారావు కావాల్సినంత కామెడి ఇచ్చిందనే టాక్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సూపర్ హిట్ అప్పుల అప్పారావు పుల్ లెంగ్త్ కామెడిమూవీ అప్పుల అప్పారావు సినిమా చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుల అప్పారావు పుల్ లెంగ్త్ కామెడిమూవీ

ధన్యవాదాలు – మూవీమిత్ర

మూవీమిత్ర

మూవీమిత్ర మూవీ బ్లాగుకు స్వాగతం! తెలుగుమూవీస్ కు సంబంధించిన తెలుగుపోస్టులతో మూవీమిత్ర ఉంటుంది.

మంచి మూవీ చూస్తే, మనసు మంచి ఆలోచనలు పొందుతుంది. శృంగార ప్రధానంగా సాగే మూవీస్ చూస్తే, మనసు శృంగారభరితమైన ఆలోచనలతో నిండుతుంది. ఎటువంటి మూవీస్ చూస్తుంటే, అటువంటి ఆలోచనలు మనసులో పెరుగుతాయి. ఇక్కడ మూవీ ఒక శృంగార విషయాల మిత్రగా మారుతుంది.

మంచిని పెంచే మూవీస్ ఎందుకు చూడాలంటే, మిగిలిన ఇతర విషయాలు అందరికీ ఇష్టమే కాబట్టి, అందరికీ ఇష్టమైన విషయాలు మనకు చేరతాయి. అవి మంచివి అయినా చెడ్డవి అయినా! అయితే మనకు మనం మంచి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం వలన మనం మంచి విషయాలు సమాజంలో పెరగడానికి కృషి చేసినవారమవుతాము. మూవీ మంచిని పెంచే మిత్రగా మారుతుంది.

ఎలా అంటే… ఒక ప్రాంతంలో ఒక లక్షమంది ఏవిషయం వైపు దృష్టి పెడితే, ఆ విషయంవైపు వెళ్ళినట్టు, యూట్యూబ్ లో మంచి విషయాలను ఎక్కువమంది చూస్తుంటే, ఆ మంచి విషయాలే యూట్యూబ్ లో రిపీట్ అయ్యి మరింతమందికి చేరతాయి. కాబట్టి మంచిని తెలియజేసే మూవీస్ ను ఎక్కువగా చూడటం వలన ఆయా మూవీలలో ఉండే సామాజిక సూచనలు కానీ మంచి విషయాలు కానీ ఎక్కువమందికి చేరతాయి.

మూవీ మిత్రుని వలె మనసుకు చేరుతుంది, ఒక సోషల్ మిత్రునిలాగా అందరికీ సలహాను తెలియజేస్తూ ఉంటుంది. మూవీ మిత్రుడు మాదిరి మనసులోకి సోషల్ ట్రెండ్సును తీసుకువస్తుంది. తెలుగు మూవీ తెలుగువారికి ఒక మిత్రత్వంతో ఉంటుంది.

మూవీస్ మనసును మరిపిస్తూ ఉంటాయి. కామెడి మూవీస్, భక్తి మూవీస్, ఫ్యామిలి స్టోరీ మూవీస్, యాక్షన్ మూవీస్, ఫాంటసీ మూవీస్ మనసును మరిపిస్తాయి. కాసేపు మనసును సాదారణ ఆలోచనల నుండి విరామం కల్పిస్తాయని అంటారు. తెలుగులో కామెడి మూవీస్ మన మనసును కాసేపు రంజింపచేస్తాయి.

కామెడి మూవీస్ నవ్వులతో నవ్వించి మనసును మరిపిస్తే, భక్తి మూవీస్ భగవంతుని మహిమలు, లీలలతో మనసును శాంతింపజేస్తాయి అంటారు. భగవంతుని గాధలు తెలుగుమూవీస్ ద్వారా వెండితెరపై చూడగానే, మనసులో మెదిలే పవిత్రమైన ఆలోచనలు, మనసుకు శాంతిని తీసుకువస్తాయని అంటారు.

మనం భక్తి భావనతో ఉంటూ భక్తి మూవీస్ చూస్తూ ఉంటే, భక్తి మూవీలలోని భావనలను మనకు ఒక మిత్ర భావనగానే చేరతాయి. అలాగే శృంగారపరమైన ఆలోచనలు కలిగి శృంగారావేశ పూరితమైన మూవీస్ వీక్షిస్తూ ఉంటే, ఒక శృంగారమిత్రగా మూవీ ఉంటుంది. ఏ భావనతో ఎటువంటి మూవీస్ చూస్తే, అటువంటి ఆలోచనలు మనసులోకి చేరతాయి. అలాంటి మూవీస్ తో మనకు వర్చువలు మిత్రత్వం ఏర్పడుతుంది.

భక్తి మూవీస్ భగవంతుని గురించి తెలియజేస్తే, ఫ్యామిలి స్టోరీ మూవీస్ కాసేపు వివిధ పాత్రలతో మమేకం చేస్తాయి. మన చుట్టూ ఉన్న పాత్రలు మూవీలలో కూడా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ స్టోరీస్ మనకు ఏదో ఒక సందేశాన్ని తెలియజేస్తూ మనసును రంజింపజేస్తాయి అంటారు.

యాక్షన్ మూవీస్ కేవలం కధనం ఆధారంగా పోరాట సన్నివేశాలు, సస్పెన్స్ తో సాగుతూ మనసును ఆకట్టుకుంటూ ఉంటాయి. ఫాంటసీ మూవీస్ చూస్తున్నంతసేపూ మనసును వేరోలోకానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.

తెలుగుమూవీస్ వివిధ అంశాలతో వివిధ కధనాలతో విభిన్నంగా ఉంటూ ఉంటే, కొన్ని మూవీస్ సాదారణంగానే ఉంటే, మరికొన్ని మూవీస్ పేలవమైన కధనంతో సాగుతాయి. కొన్ని మూవీస్ అసాదారణ స్థాయిలో ఆకట్టుకుంటే, మరికొన్ని మూవీస్ అద్భుతంగా అనిపిస్తాయి. ఏదైనా తెలుగుమూవీస్ మనసును కాసేపు మరిపిస్తాయి.

వయస్సును బట్టి చేరుతున్న ఆలోచనలు బట్టి మూవీస్ చూస్తూ ఉంటే, అప్పటి సోషల్ ట్రెండ్స్ ను బట్టి, మూవీస్ కొత్త విషయాలను మనకు ఒక మిత్రునిగా చేరవేస్తాయి. సోషల్ ట్రెండ్లను బట్టి మూవీస్ వస్తూ ఉంటే, ఆదరించే అంశ ఆధారంగా మరిన్ని మూవీస్ వస్తూ ఉంటాయని అంటారు. ఆలోచనను బట్టి, అందుకు సంబంధించిన అంశంలో విషయం చేరవేయడంలో మూవీస్ మిత్రునిలాగానే ఉంటాయని అంటారు.

మనసును మరిపించే తెలుగుమూవీస్, మనసును ఆకట్టుకునే తెలుగుమూవీస్, మనసును రంజింపజేసే తెలుగుమూవీస్, వినోదం అందించే తెలుగు మూవీస్ ఇలా వివిధ రకాల తెలుగుమూవీస్ గురించి మూవీమిత్ర పోస్టులలో….

కామెడి మూవీస్ నటీనటులు మరియు యూట్యూబ్ వీడియో లింకులతో కూడిన కామెడి మూవీస్ లిస్టును చూడటానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి.

సీనియర్ ఎన్టీఆర్ మూవీస్ లిస్టును చూడటానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

సీనియర్ ఏన్నార్ మూవీస్ లిస్టును చూడటానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ధన్యవాదాలు – మూవీమిత్ర

పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు ఓల్డ్ మూవీ…

పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు ఓల్డ్ మూవీ...

ఓల్డ్ మూవీస్ వినోదంతో బాటు సందేశం కూడా మిళితమై ఉండడం ఓల్డ్ మూవీలలో కధ గొప్పతనంగా చెబుతారు. అలాంటి మూవీలలో పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు ఓల్డ్ మూవీ…

ఈ మూవీలో పాత్రలు, పాత్రధారులు

అక్కినేని నాగేశ్వరరావు కృష్ణారావుగా నటిస్తే, కృష్ణారావుకు జతగా రుక్మిణి పాత్రలో జమున నటించింది. ఇంకా సహాయక పాత్రలలో ప్రతాప్ గా ఆర్.నాగేశ్వరరావు, రాధాదేవి పాత్రలో రాజసులోచన, భీమసేనరావు పాత్రలో ఎస్.వి.రంగారావు, సలహాలరావు పాత్రలో రమణారెడ్డి, సలహాలరావు భార్యగా సంసారం పాత్రలో ఛాయదేవి, నందాజీ పాత్రలో శివరామకృష్ణయ్య, ప్రకటనలు పాత్రలో అల్లు రామలింగయ్య, అమ్మకాలు పాత్రలో సి.హెచ్.కుటుంబరావు, ఆఫీసు ప్యూను పాత్రలో బాలకృష్ణ, ఎరుకల సుబ్బి పాత్రలో సురభి కమలాబాయి, పేరయ్య పాత్రలో బొడ్డపాటి, ఎమ్.వి.తేశం పాత్రలో పేకేటి శివరాం నటించారు. ఇంకా ఇతర నటులతో పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు ఓల్డ్ మూవీ ఉంటుంది.

కృష్ణారావు ఎంఏ పూర్తయ్యాక అతని బాబాయి సలహాలరావు(రమణారెడ్డి) సలహా మరియు సిఫారసు మేరకు ఉద్యోగానికి భీమసేనరావు ఇంటికి వస్తాడు. అక్కడ రుక్మిణి, కృష్ణారావు ఇద్దరూ ఒకరినొకరు తొలిచూపు ఇష్టపూర్వకంగానే చూసుకుంటారు. అయితే అతని చేతిలోని ఉత్తరం అప్పటికే మారి ఉండడం, ఆ ఉత్తరం రుక్మిణి చదవడం చేత, కృష్ణారావును అ ఇంట్లో వారు వంటమనిషి అనుకుంటారు. అలా అనుకుని కృష్ణారావును వంట చేయమంటారు. తరువాత అక్కడికి చేరిన సలహాలరావు కృష్ణారావు వంటమనిషి కాదు, తన బంధువు అని చెప్పి అతను ఉద్యోగం కొరకు వచ్చినట్టుగా చెబుతాడు.

తెలుగురీడ్స్ లో తెలుగుబుక్స్ గురించి ఫ్రీబుక్స్ లింకులతో విజిట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సలహాలరావు కృష్ణారావు గురించి రుక్మిణి మనసులోని మాటను తెలుసుకుంటాడు. ఆమెకు కృష్ణారావు అంటే ఇష్టం ఉందని గ్రహించి, రుక్మిణి-కృష్ణారావులకు వివాహం చేయాలని భీమసేనరావుకు సలహాలరావు సలహా చెబుతాడు. అలాగే రుక్మిణి అన్న అయిన ప్రతాప్ కూడా కృష్ణారావు గురించి సానుకూలంగానే స్పందించడంతో, భీమసేనరావు రుక్మిణి-కృష్ణారావుల వివాహాము జరిపిస్తాడు.

పెద్దల సమక్షంలో రుక్మిణి – కృష్ణారావుల పెళ్ళినాటి ప్రమాణాలు

ఇద్దరు దంపతులలో పెద్దలు పెళ్ళినాటి ప్రమాణాలు చేయిస్తారు. తరువాత రుక్మిణికృష్ణారావుల వివాహం అనంతరం పట్నంలో సలహాలరావు ఇంట్లో వారు కొత్త కాపురం ప్రారంభిస్తారు. కొంతకాలానికి వారికి సంతానం కలుగుతుంది. రుక్మిణి పిల్లలను చూసుకుంటూ ఇంటి పనులతో నిమగ్నమవుతుంది. అయితే కృష్ణారావు తన భార్యను అశ్రద్ద చేసి, వేరొక యువతి రాధాదేవి(రాజసులోచన)కి దగ్గరవుతాడు. ఆమె కృష్ణారావుకు సెక్రటరీగా పని చేస్తూ ఉంటుంది.

రుక్మిణికృష్ణారావుల కాపురం గమనించిన సలహాలరావు, ప్రతాప్ ఇద్దరూ వారి కాపురం సరిదిద్దే పనిలో పడతారు. వారి కాపురు వీరు ఎలా సరిదిద్దారనేది ప్రధానంశం ఈ మూవీ కధ ఉంటుంది. కనీసం ఒక్కసారైనా చూడదగిన ఓల్డ్ తెలుగుమూవీలలో పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు ఓల్డ్ మూవీ… కూడా ఒక్కటిగా పెద్దలు చెబుతారు.

పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు ఓల్డ్ మూవీ…

మన పాత తెలుగు మూవీలో మనకు మేలైన సంఘటనలను చూపుతాయని పెద్దలు అంటారు. పాత తెలుగుమూవీలు చూడడం వలన ఒక పాత మిత్రుడుని పరిచయం చేసుకున్నట్టుగా భావిస్తే, ఆనాటి సామాజిక జీవనంపై ఒక అవగాహన ఉంటుంది అంటారు.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెలుగు ఓల్డ్ మూవీస్ లిస్టు చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఏన్నార్ నటించిన తెలుగుమూవీస్ మరియు యూట్యూబ్ వీడియో లింకులతో కూడి ఉంటాయి.

ధన్యవాదాలు – మూవీమిత్ర

ఆడుతూ పాడుతూ

సిటి లైఫ్ కష్టాలు ఎక్కువగా ఉంటే, వాటితో ఎడ్జస్ట్ అవుతూ కుర్రాళ్లు పడే పాట్లు కూడా చిత్రంగానే ఉంటాయి. సిటిలో ఉండడానికి స్థలం లేకుండా ఒక పాత బస్సులోనే కాపురం చేస్తూ ఉండే తన మిత్రునితో కలిసి ఉండే ఒక కుర్రాడి జీవితంలోకి ఒక అందమైన అపరిచిత అమ్మాయి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో? అనేది ప్రధానంశంగా ఆడుతూ పాడుతూ తెలుగుమూవీ ఉంటుంది.

పార్టులు ఊడిపోవడానికి సిద్దంగా ఉండే బస్సులోనే జీవనం సాగిస్తున్న గోపి(శ్రీకాంత్) కి తోడు పాపరావు(సునీల్) స్నేహితుడు ఉంటాడు. అనుకోకుండా ఒక రోజు ఒక అమ్మాయి వచ్చి వారి బస్సులో ఉండిపోతుంది. ఆ అమ్మాయి వారికి తెలియని భాషలో మాట్లాడుతూ వారిని గందరగోళంలో ఉంచి అక్కడే ఉంటుంది. ఆ అమ్మాయిని వదిలించుకుందామని ప్రయత్నించే గోపి ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. వారి ప్రేమ ఒకరినొకరు తెలుసుకునే లోపులోనే ఆ అమ్మాయి తాలుకూ మనుషులు వచ్చి ఆమెను తీసుకువెళ్లిపోతారు.

అతనితో కలసి ఉందామని అనుకున్న ఆ అమ్మాయి, కావాలనే అతనికి ఎందుకు దూరం అయ్యింది? ఆ అమ్మాయి ఎవరు? తెలుసుకోవడానికి ఈ మూవీ వాచ్ చేయడానికి ఇక్కడ టచ్ క్లిక్ చేయండి.

ఆడుతూ పాడుతూ తెలుగుమూవీలో శ్రీకాంత్, గాయత్రి జయరామ్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, గుండు హనుమంతరావు, జూనియర్ రేలంగి, సత్తిబాబు, తెలంగాణ శకుంతల, అనితా చౌదరి తదితరులు నటించారు

ధన్యవాదాలు – మూవీమిత్ర

యమలీల

కమెడియన్ ఆలీ హీరోగా చేసిన తెలుగుమూవీ యమలీల, ఈమూవీలో ఆలీతో బాటు ఇంద్రజ, కెకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, తనికెళ్ళ భరణి, ఏవిఎస్, కోట శ్రీనివాసరావు, మంజుభార్గవి, సాక్షి రంగారావు, సుబ్బారాయశర్మ అతిధి పాత్రలో కృష్ణ తదితరులు నటించారు. యమలీల మూవీకి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.

చిత్రగుప్తుని చేతులలో నుండి జారిన భవిష్యవాణి గ్రంధం, భూమిపై పేదరికం అనుభవిస్తున్న వ్యక్తిపై పడుతుంది. చిత్రగుప్తుడు చేసిన పొరపాటుకు యముడు, చిత్రగుప్తుడు ఇద్దరూ భవిష్యవాణి కోసం భూమిపైకి దిగుతారు. అలా భూమిపై అడుగుపెట్టిన యముడు, చిత్ర గుప్తుడు ఏవిధంగా భవిష్యవాణి పుస్తకం తిరిగి పొందుతారు అనేది ఈమూవీ ప్రధానంశం. ఆక్రమంలో వారి వేషధారణ, మాటతీరు కామెడిని అందిస్తాయి.

భవిష్యవాణి పొందిన యువకుడు, భవిష్యవాణిలో కనబడే సూచనలు ఆధారంగా కోటీశ్వరుడు అవుతాడు. అలాగే భవిష్యవాణి సూచనతో తన తల్లికి మరణం సమీపించందనే విషయం తెలుసుకుంటాడు. ఆ భవిష్యవాణి గ్రంధం కోసం వచ్చిన యముడిని ఏవిధంగా ఒప్పించి, తన తల్లిని రక్షించుకుంటాడో ఈమూవీ చూడాలి. కామెడితోబాటు తల్లి సెంటిమెంటు పాట కూడా బాగుంటుంది.

ఆలీకి అద్భుతమైన హిట్ మూవీగా యమలీల తెలుగుమూవీ నిలిచింది. ఈ మూవీ యూట్యూబ్ ద్వారా చూడటానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి

ధన్యవాదాలు – మూవీమిత్ర