బాపు వెండిబొమ్మ సీతాకళ్యాణం తెలుగుఓల్డ్ మూవీ

బాపు గీసిన బొమ్మలంటే మనసుకు మనోహరంగా కనిపిస్తాయి. మరి మనోహరమైన రూపాలు అయిన సీతారాములను బాపు వెండితెరపై చూపితే ఇంకెలా ఉంటుందో? అంటే బాపు వెండిబొమ్మ సీతాకళ్యాణం తెలుగుఓల్డ్ మూవీ చూడాల్సిందే… చూడదగిన తెలుగు ఓల్డ్ భక్తి మూవీలలో సీతాకళ్యాణం కూడా చూడవచ్చు అంటారు.

శ్రీరామాయణంలో కొన్ని ప్రముఖ ఘట్టాలలో దశరధుని పుత్రకామేష్ఠియాగం, సీతాజననం, శ్రీరామునికోసం విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు రావడం, తాటక సంహారం, మహర్షి అస్త్రోపదేశం, రామలక్ష్మణుల విశ్వామిత్రుని యాగరక్షణ, అహల్య శాపవిమోచనం, విశ్వామిత్రుడి పూర్వాశ్రమం గురించి రామలక్ష్మణులకు తెలియజేయడం, గంగావతరణం గురించి తెలియజేయడం, శివధనుర్భంగం, సీతారామకళ్యాణం, పరశురామ గర్వభంగంతో సీతాకళ్యాణం తెలుగుఓల్డ్ మూవీ సుఖాంతం అవుతుంది.

శ్రీరాముని పాత్ర అంటే కేవలం ఎన్టీ రామారావుని మాత్రమే చూసిన తెలుగు ప్రేక్షకులకు శ్రీరాముని పాత్రలో కొత్త నటుడిని బాపు చూపించడం సీతాకళ్యాణం తెలుగుఓల్డ్ మూవీ ప్రత్యేకతగా ఉంటుంది.

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగు బుక్ గురించి తెలుగువారి ఇంటిపేర్లను తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

జయప్రద సీతగా చాలా చక్కగా కనబడుతుంది. శ్రీరాముడుగా రవికుమార్ మనోహరంగా ఆకర్షిస్తాడు. శ్రీరాముడు రామాయణంలో ఆద్యంతం అవసరం మేరకు మాట్లాడతాడని పండితులు అంటారు. అయితే సీతాకళ్యాణం తెలుగుఓల్డ్ మూవీలోమాత్రం రెండుమూడు సంభాషణలు మాత్రమే ఉండడం విశేషం.

శ్రీరామజననం దగ్గర నుండి సీతారాముల కళ్యాణం వరకు వివిధ ఘట్టాలను వివరణాత్మకంగా చూపించారు.

బాపు వెండిబొమ్మ సీతాకళ్యాణం తెలుగుఓల్డ్ మూవీ

శ్రీరామునికి నామకరణం చేసేటప్పుడు రామనామం గురించిన వైశిష్ఠ్యం, వశిష్ఠ మహర్షి వివరించడం, శివధనుస్సు గురించిన పూర్వకధను సీతమ్మకు వివరించడం, గంగను భూమికి తీసుకురావడం కోసం భగీరధుని ప్రయత్నంగురించి వివరించడం తదితర ఘట్టాలు సీతాకళ్యాణం తెలుగుమూవీలో బాగుంటాయి.

శ్రీరామాయణంలోని వివిధ తెలుగు రయితల తెలుగు ఫ్రీబుక్స్ గురించి తెలుసుకోవడానికి ఈ తెలుగులింకుపై క్లిక్ చేయండి.

ఈ సీతాకళ్యాణం తెలుగుఓల్డ్ మూవీలో శ్రీరాముడుగాను, శ్రీమహావిష్ణువుగాను రవికుమార్ నటించగా, సీతమ్మగానూ, లక్ష్మిదేవిగాను జయప్రద చక్కగా నటించారు. దశరథుడుగా గుమ్మడి వెంకటేశ్వరరావు నటించారు. సీతమ్మ తండ్రి జనకుడుగా మిక్కిలినేని నటించారు. రావణుడు పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు. రఘువంశమునకు కుల గురువు వశిష్ఠుడుగా దూళిపాల నటించగా, రామలక్ష్మణులకు గురువు విశ్వామిత్రుడుగా ముక్కామల నటించారు. ఇంకా సీతాకళ్యాణం తెలుగుమూవీలో హేమలత, జమున, పి.ఆర్.వరలక్ష్మి, త్యాగరాజు, ప్రభ తదితరులు నటించారు.

సీతాకళ్యాణం తెలుగు ఓల్డ్ మూవీకి బాపు దర్శకత్వం వహించగా, ముళ్లపూడి వెంకటరమణ మాటలు వ్రాశారు. కెవి మహదేవన్ సంగీతం అందించారు. పింజల ఆనందరావు, సుబ్బారావులు ఈ మూవీని నిర్మించారు. బి.వసంత, ఎస్.జానకి, వాణీ జయరాం,పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వి.రామకృష్ణ తదితరులు ఈమూవీకి నేపధ్యగానం అందించారు.

యూట్యూబ్ వీడియోగా ఈమూవీ వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – మూవీమిత్ర

Add a Comment

Your email address will not be published. Required fields are marked *