గుణసుందరికధ తెలుగు ఓల్డ్ మూవీ

కెవి రెడ్డి దర్శకత్వం వహించిన గుణసుందరికధ తెలుగు ఓల్డ్ మూవీ చక్కనైన కుటుంబకధాచిత్రం. గుణసుందరి కధను పార్వతిదేవికి పరమేశ్వరుడు చెప్పడం, పార్వతి పరమేశ్వరులే ఆమెను ఏవిధంగా అనుగ్రహించిందీ ఈ మూవీ కధాంశం.

గుణసుందరికి తండ్రి ఉగ్రసేన మహారాజుగా గోవిందరాజు సుబ్బారావు నటించారు. గుణసుందరికి పెద్దఅక్కయ్య పాత్రలో రూప సుందరిగా శాంతకుమారి, చిన్నక్కయ్య హేమసుందరిగా మాలతి నటించారు. గుణసుందరి పాత్రలో శ్రీరంజని భర్త అయిన వీరసేనమహారాజు మారురూపంలో దైవాధీనంగా కస్తూరి శివరావు, వీరసేనమహారాజుగా వి శివరాం నటించారు. రూపసుందరి భర్త హరమతిగా గోబేరు సుబ్బారావు, హేమసుందరి భర్త కాలమతి పాత్రలో రేలంగి నటించారు. పార్వతీ దేవిగా టి జి కమలాదేవి, పరమశివుడుగా జంధ్యాల గౌరీపతిశాస్త్రి నటించారు. మొదటి యక్షిణిగా హేమలత, రెండవ యక్షిణిగా కనకం, మూడవ యక్షిణిగా లక్ష్మీరాజ్యం (జూనియర్) ఇంకా తదితర నటులు గుణసుందరికధ తెలుగు పాత మూవీలో నటించారు.

కైలాసంలో ఉన్న పార్వతిపరమేశ్వరులకు గుణసుందరి ప్రార్ధన వినవస్తుంది. పార్వతిదేవి, పరమేశ్వరుని గుణసుందరి గురించి అడగగా…అప్పుడు పార్వతి మాతకు పరమేశ్వరుడు గుణసుందరి కధను వివరిస్తాడు.

ధారా నగరమును పాలిస్తున్న ఉగ్రసేన మహారాజుకు ముగ్గురు కుమార్తెలు, తల్లి లేని వారిని ఆ మహారాజే, అన్ని అయ్యి ప్రేమగా పెంచుతాడు. ఉగ్రసేన మహారాజుకు ఇద్దరు మేనల్లుల్లైన హరమతికి, కాలమతికి తన ఇద్దరి పెద్దకుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకుని, మూడవ కుమార్తె అయిన గుణసుందరికి మంచి వరుడుని ఎంపికచేయాలని భావిస్తాడు.

ఉగ్రసేన మహారాజు తన షష్ఠిపూర్తి రోజున నిండు సభలో తన ముగ్గురు కుమార్తెలను సభకు పరిచయం చేస్తాడు. ఆ సభలో రూపసుందరి, హేమసుందరి ఇద్దరూ తండ్రికోసమే బ్రతుకుతున్నట్టుగా, తండ్రే సర్వస్వంగా మాట్లాడతారు. కానీ గుణసుందరి మాత్రం తండ్రిని ప్రేమిస్తాను కానీ అంతకన్నా నాకు కాబోయే పతియే సర్వస్వం అని చెబుతుంది. దైవం ఎటువంటి భర్తని ఇస్తే, ఆభర్తనే దైవంగా భావించి సేవిస్తాను అని అంటుంది. ఆమాటలకు కోపగించిన ఉగ్రసేన మహారాజు, గుణసుందరికి చెవిటి,మూగ,గ్రుడ్డి,కుంటి అయిన దైవాధీనం అనే ముసలివాడితో వివాహం జరిపిస్తాడు.

ముసలితో గుణసుందరి వివాహం

వివాహానంతరం గుణసుందరి భర్త ముసలివాడే కానీ చెవిటి, మూగ, గ్రుడ్డి, కుంటి కాదు అని రాజుకు తెలుస్తుంది. కోపగించుకున్న రాజు దైవాధీనమును చేయివెత్తి, మెట్లపైనుండి క్రిందకు పడిపోతాడు. రూపసుందరి, హేమసుందరి ఇద్దరూ గుణసుందరిని అంత:పురం నుండి వెళ్ళగొడతారు. గుణసుందరి తన భర్తదైవాధీనం (వీరసేన మహారాజు) కలసి ఎరుకల గూడెంలో కాపురం పెడతారు.

మంచానపడ్డ ఉగ్రసేన మహారాజు కాలిగాయం ముదిరి, ఆగాయం తాలుకూ విషం తలకు కూడా పాకుతుంది. వైద్యులు మణి చికిత్స చేస్తేగాని ఈ గాయాలు నయం కావని చెబుతారు. అందుకు మహేంద్రమణి అవసరం అని చెబుతారు. అయితే ఆ మహేంద్రమణి ఎక్కడ ఉందో? ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి అంజనం వేసి తెలుసుకుంటారు. దుస్సాద్యమైన మహేంద్రమణిని తీసుకువచ్చినవారికి తన రాజ్యం త్రికరణశుద్దిగా ఇచ్చేస్తానని రాజు ప్రకటిస్తాడు.

మహేంద్రమణిని సాధించడానికి హరమతి, కాలమతి ఇద్దరూ బయలుదేరతారు. గుణసుందరి తన భర్తను కూడా మహేంద్రమణికోసం పంపుతుంది. ముసలివాడు అయిన దైవాధీనం యక్షితలను మెప్పించి, మణిని ఎలా సాధించాడు? మణి లభించాక దైవాధీనం ఎలుగబంటిగా ఎందుకు మారతాడు? చివరికి ఎవరిసాయంతో రాజుకు చికిత్స జరిగి, దైవాధీనం వీరసేన మహారాజుగా ఎలా మారతాడు? వీటికోసం గుణసుందరికధ తెలుగు ఓల్డ్ మూవీ చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది, అంటారు.

గుణసుందరికధ తెలుగు ఓల్డ్ మూవీ

ధన్యవాదాలు – మూవీమిత్ర

Add a Comment

Your email address will not be published. Required fields are marked *