నేహా శర్మ టీషర్ట్ చాలెంజ్

నేహా శర్మ టీషర్ట్ చాలెంజ్

కరోనా కోరలు చాచుకుని బయట బసచేస్తే, ఇంట్లోనే ఉండేవారికి బంధువర్గం బలంగా ఉంటే ఫరవాలేదు కానీ ఒక్కరై ఉన్నప్పుడు మాత్రం కాలక్షేపం కాదు. క‌రోనా వైరస్ వ్యాప్తి వలన సెలబ్రిటీలతో సహా అంద‌రూ ఇంట్లోనే గ‌డుపుతున్నారు. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సెలబ్రీటిలు చేసే పనులు మాత్రం మీడియాలో వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి. అలా ఇప్పుడు చిరుత హీరోయిన్ నేహాశర్మ కూడా క్వారెంటైన్‌లో విసుగుచెంది, టీ-ష‌ర్ట్ చాలెంజ్ చేయడం మొదలుపెట్టింది. అది ఎలాగో వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నేహాశర్మ, ఆ వీడియో టీషర్ట్ చాలెంజ్ గురించి ఉంది..

చేతులు రెండూ నేల‌కు ఆనిచ్చి, కాళ్ల‌ను పైకి లేపి గోడ‌ను తాకాలి. అది కూడా బోర్ల‌ప‌డుకొని. కాళ్లు పైకెత్తి గోడ‌కు అంటించిన స‌మ‌యంలో చేతుల‌తో టీ-ష‌ర్ట్ ధ‌రించాలి. ఇదే చాలెంజ్ ప్ర‌త్యేక‌త‌. ఇది చేయ‌డం కష్టమైన పనే అంటారు. మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

నేహా శర్మ టీషర్ట్ చాలెంజ్

నేహా శర్మ టీషర్ట్ చాలెంజ్

చెల్లి ఈషా శ‌ర్మ‌ను ఈ స‌వాల్ స్వీకరించమని నేహా శర్మ టీషర్ట్ చాలెంజ్ సవాల్ చేసింది. లాక్ డౌన్ చాలా విసుగు చెందాను అందుకే చాలెంజ్ ప్ర‌య‌త్నించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఈ చాలెంజ్‌ను ఇబ్బందిప‌డ‌కుండా ఆనందంగా స్వీక‌రిస్తార‌ని అనుకుంటున్నాను. దీంతో మంచి టైంపాస్ అవుతుంది కూడా’ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఇంట్లోనే ఉండండి. సుర‌క్షితంగా ఉండండి అంటూ ట్యాగ్ చేసింది నేహా . ఈ వీడియోను 1 మిలియ‌న్‌కు పైగా వీక్షించారు.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *