పుష్ప బన్నీ న్యూమూవీ టైటిల్

పుష్ప బన్నీ న్యూమూవీ టైటిల్

పుష్ప బన్నీ న్యూమూవీ టైటిల్, టైటిల్ చిత్రంగానే ఉంది. మూవీకి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ స్టైల్ ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య-2 విజయవంతం అయ్యాయి. మరలా ఈ హిట్ ఫెయిర్ పుష్పతో 2020లో ముందుకు రానున్నారు.

అల వైకుంఠపురం మూవీతో మెగా హిట్ కొట్టిన అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సునిశిత దర్శకుడు సుకుమార్‌ ఓ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ తెలుగుమూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సరిలేరు నీకెవ్వరుతో సంక్రాంతికి హిట్ కొట్టిన రష్మిక మందన్న బన్నికి జోడిగా నటిస్తుంది. 2019 అక్టోబర్‌లో ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకుంది. కానీ కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడింది. అసలు మేలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరగాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్‌ సందర్భంగా బుధవారం ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

బన్ని 20వమూవీకి పుష్ప అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈమూవీలో స్టైలిష్ స్టార్ లుక్ చాలా ర‌ఫ్ అండ్ మాస్ ఉండి ఆకట్టుకునే అప్పీరెన్స్ కలిగివుంది. రంగస్థలం మాదిరి బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ ఉండవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీలో లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించనున్నాడు. ఈ పుష్ప మూవీ కధాంశం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో నడిచే ఇతివృత్తమిదని, అల్లు అర్జున్‌ పాత్ర చిత్రీకరణ నవ్యరీతిలో సాగుతుందని చిత్ర బృందం అంటోంది. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కావ‌డంతో మూవీ అంచనాలు భారీగానే ఉండవచ్చు. పుష్ప బన్నీ న్యూమూవీ టైటిల్ గా వైరెటీగా అల్లువారి అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *