మంచు ఫ్యామిలీ కరోనా బాధితులకు సాయం

మంచు ఫ్యామిలీ కరోనా బాధితులకు సాయం

కరోనా భారిన పడుతున్న బాధితులకు మూవీ నటులు సహాయసహకారాల విరాళాలు అందిస్తున్నారు. క‌రోనా వైరస్‌ గురించి దాని కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడుతుంది. అందులో భాగంగా పేద కార్మికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సినిమా రంగంలోని పెద్దలే స్వయంగా సినీప‌రిశ్ర‌మ‌కి చెందిన పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు ఛారిటీ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కొంద‌రు విరాళాలు అందిస్తుంటే, మ‌రికొంద‌రు ప్రముఖులు స్వయంగా పేదవారికి సాయం అందిస్తున్నారు. అలా మంచు ఫ్యామిలీ కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు.

పేద‌వారి కడుపుకోత తీర్చేందుకు మంచు కుటుంబం కూడా సిద్దమయ్యింది. అందులో బాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకుంది. తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి మంచు మోహన్ బాబు చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు రోజులో రెండు పూటలా ఆహారం పంపిణీ ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఇంకా 8టన్నుల కూరగాయల్ని గ్రామాల్లోని పేదలందరికీ ఉచితంగా సరఫరా చేస్తున్నారు. తన సొంత జిల్లా ప్ర‌జ‌ల కోసం మంచు మోహ‌న్ బాబు మాస్కులు, శానిటైజర్లను కూడా అందిస్తున్నారు. మ‌రోవైపు మంచు మ‌నోజ్ త‌న టీం స‌భ్యుల‌ని తెలుగు రాష్ట్రాల‌కి పంపి పేద వారికి ఆహారం, నీరు స‌ర‌ఫ‌రా చేయిస్తున్నారు. మంచు ఫ్యామిలీ కరోనా బాధితులపై చూపుతున్న దాతృత్వంపై మోహన్ బాబు అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *