అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది

అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది

అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది. మూవీ చూస్తే మనసు మైమరిచిపోవాలి. అటువంటి మూవీకి మరలా మరలా వీక్షకులు వస్తూ ఉంటారు. అల వైకుంటపురం మూవీ అలాంటి కోవలోకి వచ్చేది. సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అల అంతకన్నా అన్నట్టుగా జరిగింది.

మాటల మాంత్రికుడి మాటలు, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్ పూజా హెగ్డె అందం, చందం చక్కగా అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మురళీశర్మ పాత్ర పూర్తిగా అల్లు అర్జున్ పాత్రను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తుంది. ఎక్కడా బన్నీ పాత్ర తగ్గకుండా మురళీశర్మ పాత్ర తెరపై కదలడం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిభకు పట్టం కడుతుంది.

మిగిలిన పాత్రలు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. అంతా అల్లు అర్జున్ పాత్రకు మద్దతుగా ఉండేవారే కానీ బన్నీ పాత్రను మించి ఉండదు. స్టోరీ చిన్నదే, కానీ తీసుకున్న పాయింట్ అల్లుకున్న సన్నివేశాలు మన మనసును కట్టిపడేస్తాయి. అంతేకాకుండా మాటల మాయ మనపై ఎలాగో ఉంటుంది.

ఈ మూవీ ట్రైలరులో కూడా చూపించారు… బన్నీ డైలాగు ఒక్కటి… అదేమిటంటే ‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి… ఒకటి వాళ్లకి… అలాంటి వాళ్లకి సరెండర్ అయిపోవాలి’ ఈ డైలాగు మాత్రం అందరి మనసును తాకుతుంది. ఇక స్త్రీ యొక్క గొప్పతనం గురించి పుస్తకాలకు పుస్తకాలలో చెప్పినదంతా ఒకే ఒక్క డైలాగులో పవర్ పుల్ చెప్పడం త్రివిక్రమ్ శ్రీనివాస్ కే చెల్లింది.

అలాగా ఈ మూవీ అల్లు అర్జున్ నటతోనూ, మాటల మాయతోనూ అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది… మనసును కట్టిపడేస్తుంది. ఈ మూవీ కధ విషయానికొస్తే… చాలా సింపుల్… ఒక మిడిల్ క్లాస్ మనిషి, మరొక హైక్లాస్ మనిషికి ఒక తండ్రి వయస్సులో ఆలోచన ఎలా ఉంటుందో… అదే ప్రధాన నేపధ్యంగా ఈమూవీ సాగుతుంది.

అల వైకుంఠపురం అలా అలా కధ ఎలా అంటే

రామచంద్రరావు, వాల్మీకి ఇద్దరు స్నేహితులు ఒకే కంపెనీలో ఉంటారు. అయితే రామచంద్రరావు ఆ కంపెనీకి బాస్ అవుతాడు. వాల్మీకి అలానే ఉంటాడు. వారిరువురికి ఒకేసారి ఇద్దరు మగపిల్లలు పుడతారు, ఒకే ఆసుపత్రిలో… కానీ రామచంద్రరావుకు పుట్టిన బాబు కదలకుండా అలానే ఉంటాడు. దాంతో నర్సు కంగారుపడుతూ ఆ విషయం చెప్పడానికి టెలిఫోన్ బూతుకు వెళ్తుంది. అక్కడే ఫోన్ మాట్లాడుతున్న వాల్మీకికి విషయం తెలుస్తుంది. వెంటనే వేగంగా ఆలోచించిన వాల్మీకి… నర్సుతో తన ఆలోచనను చెబుతాడు.

అదేమిటంటే తనకు కొడుకే పుట్టాడు. రామచంద్రరావు కొడుకు ప్లేసులో తనకొడుకుని పెట్టేయమని చెబుతాడు. అయితే ఆమె అయోమయంలో ఉండగానే… నేను అదే కంపెనీలో పనిచేస్తున్నాను వారికి సాయం చేయనీయమని చెప్పి అంటారు. అలా రామచంద్రరావు కొడుకు, వాల్మీకి కొడుకుగాను… వాల్మీకి కొడుకు రామచంద్రరావు కొడుకుగాను పెరుగుతారు. మిడిల్ క్లాస్ కష్టాలతో బంటు, హయ్యర్ క్లాసు అనుభవంతో రాజ్ పెరుగుతారు.

ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుని ఇంటర్యూకి వెళ్లే బన్ని తన చెల్లెలిని అల్లరిచేశారని, తనకు ఉద్యోగం ఇవ్వబోయే హెచ్.ఆర్. నే కొడతాడు. తర్వాత ఉద్యోగం పొందుతాడు. అంతేకాకుండా ఆ ఆఫీసు బాసు అమూల్య అందాల్ని కూడా ఆరగా చూస్తాడు. ఆమె బాస్ అని తెలియక… ఆబాస్ గా పూజాహెగ్డె నటించింది. అలా బంటు చేసే పనులన్నీ మనకు కామెడిని బాగా పంచుతాయి.

బంటు మేడమ్ అమూల్యకు, రామచంద్రరావు కొడుకు రాజ్ కు నిశ్చితార్దం చేసుకుంటారు. అయితే ఈలోపులోనే బంటూ, అమూల్యలు మనసులు ఒక్కటవుతాయి. నిశ్చితార్ధం ఇష్టంలేదని చెప్పడానికి అమూల్య, బంటులిద్దరూ రామచంద్రరావు ఆఫీసుకు వెళ్తారు. అయితే అప్పటికే రామచంద్రరావుగారిని గుండెలపై పొడిచి ఉండడంతో అయన క్రిందపడి ఉంటాడు. అక్కడి నుండి రామచంద్రరావుగారి బంటు, అమూల్యలు ఆసుపత్రికి తీసుకువెళతారు.

అక్కడ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ కు వస్తున్న రామచంద్రరావుని చూసిన నర్సు, బంటుతో అసలు నిజం చెబుతుంది. నిజం తెలిసిన బంటు ఏంచేశాడనేది.. ఈ మూవీని మరింత ఆసక్తిగా మలిచేశారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…

ఎప్పడూ మౌనంగా ఉండే రాజ్, రామచంద్రరావు సంపాదనను దోచుకుంటున్న బావమరిది, రామచంద్రరావు – అతని భార్య మాటలు లేకపోవడం… ఇలా సమస్యలతో సతమతమవుతున్న అల వైకుంటపురంలోకి అసలైన వారసుడు వచ్చి ఏంచేశాడనేది… మూవీ చూడాల్సిందే… మూవీమిత్ర…

కధలో భారీ భారీ మలుపులు లేకున్న బోర్ అనిపించకుండా మూవీ అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది.

అల వైకుంఠపురం అలా అలా మరుపిస్తే ఈ సినిమాకు నిర్మాతలు చినబాబు,అల్లు అరవింద్ అయితే నటులు అల్లు అర్జున్,పూజా హెగ్డే,సుశాంత్,జయరాం,సముద్రఖని, మురళీ శర్మ,సచిన్ కేద్కర్,టబూ,నివేతా పేతురాజ్,హర్షవర్థన్,సునీల్,రాహుల్ రామకృష్ణ,నవదీప్ తదితరులు.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *