సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఏదీ…

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఏదీ

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఎవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ టైటిల్ కు తగ్గ కధను ఎంచుకున్నాడు. మిలటరీ దేశానికి కాపుకాస్తుంటే, ఆకాపుకు తన భర్తని, తనకొడుకులన పంపించి ఓ భారతనారి… భర్త చనిపోయినా పెద్దకొడుకు మిలటరిలోకి వెళ్తాడు. అతను చనిపోయినా అతని తమ్ముడు మిలటరీలోనే ఉంటాడు. అతను కూడా చనిపోయే స్థితిలో ఉంటే, అతని ఇంట్లో శుభకార్యం ఉంటే, ఇది తెలిసిన మిలటరీ అధికారులు ఆమెను ఎలా సత్కరించారో అదే సరిలేరు నీకెవ్వరూ కధాంశం..

సరిలేరు నీకెవ్వరు స్టోరీ

కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజిలో భారతి ప్రొఫెసరుగా పనిచేస్తూ ఉంటుంది. సత్యమును నిశ్చింతగా ధైర్యంగా చెప్పగల స్త్రీమూర్తి ఆమె. అటువంటి భారతి కూతురికి పెళ్ళి చేయాలని నిశ్చయిస్తుంది. అయితే భారతి భర్త, ఆమె పెద్ద కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించినా ఆమె చిన్న కొడుకును కూడా సైన్యంలో చేరుస్తుంది. అతని పేరు అజయ్ కృష్ణ అయితే, కధానాయకుడు పేరు కూడా అజయ్ కష్ణే. అతనే మేజర్ అజయ్ కృష్ణ భారత సరిహద్దుల్లో సైన్యంలో మేజర్ గా పనిచేస్తుంటాడు. భారతి తెలియజేసిన చెల్లెలి వివాహ విషయం విన్న అజయ్ కృష్ణ పెళ్ళికి వెళ్లాలనుకుని, మిలటరీ అధికారి అనుమతి కూడా తీసుకుంటాడు.

కానీ ఒకానొక ఉగ్రవాద ఆపరేషన్ కోసం వెళ్ళిన అజయ్, తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోతాడు. భారతి కుటుంబం సైన్యానికి చేసిన త్యాగఫలితమో, సైన్యాధికారి మానవతా ధృక్పథమో… మిలటరీ అధికారులు అజయ్ కృష్ణను సైన్యం తరఫున భారతి కుటుంబానికి వెళ్ళి సాయం చేయమంటారు. అతనికి తోడుగా మరో సైనికుడు ప్రసాద్ (రాజేంద్రప్రసాద్) కూడా వెళతాడు. ట్రైనులో వీరికి సంస్కృతి(రష్మిక మందన్న) అనే అల్లరిపిల్ల తారసపడుతుంది. అమె, అమె కుటుంబం చేసే అల్లరి మొదటి భాగం నడిస్తే, కర్నూలులో భారతికి జరిగిన అన్యాయం, అందుకోసం అజయ్ కృష్ణ చేసిన ప్రయత్నంతో రెండవభాగం ఉంటుంది. సినిమా కామెడీగానూ సీరియస్ గానూ సాగుతూ అందరినీ అలరిస్తుంది.

రష్మిక మందన్న అల్లరితనం అంతా ఈ మూవీలోనే కనబడుతుంది. మహేశ్ బాబు, ప్రకాశ్ రాజ్, విజయశాంతి తదితరులు చక్కగా నటించారు. ఒక్కడు మూవీలో ప్రకాశ్ రాజ్, మహేశ్ బాబు సన్నివేశాలు అకట్టుకుంటే, ఈ మూవీలో కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ ఫైట్ సన్నివేశం ఆకట్టుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *