7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా…

7th-సెన్స్-6th-సెన్స్-తో-ఆలోచించినట్టుగా

7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా… ఉంటుంది. కరోనా వైరస్ కానప్పటికీ అలాంటి వైరస్ తో చైనా మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, భారతీయులు ఎలా ఎదుర్కొన్నారో…

ఈ 7th సెన్స్ తెలుగు మూవీ తమిళ మాతృక అయితే తెలుగులోకి డబ్ చేశారు. తెలుగు డబ్బింగ్ మూవీలలో మంచి హిట్ మూవీ 7th సెన్స్ తెలుగుమూవీ. ఈ మూవీకి దర్శకుడు మురుగుదాస్, నటీనటులు సూర్య, శృతి హాసన్, జానీ ట్రి గుయేన్, అభినయ, గిన్నిస్ పక్రు, అశ్విన్ కాకుమాను తదితరులు నటించారు. నిర్మాత స్టాలిన్.

దక్షిణ భారతదేశం నుండి చైనాకు వెళ్ళి, అక్కడి వారిని అంటువ్యాధిని భారి నుండి కాపాడిన మన మన భారతీయుడి గురించి మనలో ఎంతమందికి తెలుసు? ఇదే ప్రశ్న 7th సెన్స్ మూవీలో కూడా ఉంటుంది. రాజుల కాలంలోని బోధిధర్ముడు భారతీయ కళలోనూ ఆయుర్వేదంలోని మహాదిట్ట. ఈయన చైనాకు బయలదేరతాడు.

ఎన్నో ప్రయాసల పడిన తరువాత చైనాకు చేరిన బోధి ధర్ముడిని అక్కడివారు శత్రువు చూస్తారు. బోధిధర్ముడుని ఊరిలోనికి రానివ్వరు. అయితే ఊరికి దూరంగా బోధిధర్ముడు ఉంటాడు. కొన్నాళ్ళకు ఆఊరిలో వింత అంటురోగం సోకి ప్రజలు పండుటాకుల్లాగా రాలిపోతూ ఉంటారు. ఆఊరిలో జనులంతా భయపడి, ఆ వ్యాధి ఎవరికి సోకితే వారిని ఊరికి దూరంగా పడేస్తూ ఉంటారు.

7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా...
7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా…

అలా అంటువ్యాధి సోకి బయటపడవేయబడ్డ ఓ చిన్నారిని బోధిధర్ముడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుస్తాడు. అలా మార్చిన ఆబాలికను బోధిధర్ముడు ఆఊరిదగ్గరకు తీసుకువస్తాడు. ఆచిన్నారి తల్లి తన కూతరు రావడంతో పొంగిపోతుంది. అంతే ఆఊరి ప్రజలంతా బోధిధర్ముడు పాదాలకు మ్రొక్కుతారు.

ఆపై బోధిధర్ముడు చెప్పిన విధంగా ఆయుర్వేద చికిత్సను అక్కడివారంతా పొందుతారు. ఆఊరే కాకుండా పొరుగున ఉన్న ఊరివారు, దూరాన ఉన్న ఊరివారు వచ్చి బోధిధర్ముడి దగ్గర ఆయుర్వేద మందును గురించి వ్రాసుకుని వెళతారు. అలా ఆరోగ్య రహస్యాలను బోధిధర్ముడు చైనీయులకు చెప్పనట్టుగా 7th సెన్స్ మూవీలో చూపించారు.

మరి కొన్నాళ్లకు ఆ ఊరిపై బందిపోటులు దాడిచేస్తారు. బందిపోట్లు ఊరిపై పడి దోచుకుంటుంటే, బోధిధర్ముడు తనకు తెలిసిన విద్యతో వారిని తరిమిగొడతాడు. బోధిధర్ముడు ఆత్మరక్షణ విద్యను చూసి ఆశ్చర్యపోయిన వారంతా, బోధిధర్ముడిని ఆత్మరక్షణ కళను కూడా నేర్పమని ప్రాధేయడినట్టు 7th సెన్స్ మూవీలో కనబడుతుంది.

చాలా ఏళ్ళ తరువాత స్వదేశానికి వెళ్ళానుకున్న బోధిధర్ముడివి ఆహారంలో విషం ఇస్తారు. తనకు విషం పెట్టారి తెలిసీ కూడా బోధిధర్ముడు ఆ విషాహారాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. సర్వమానవ సౌబాతృత్వం అంతా బోధధర్ముడిలోనే కనబడుతుంది. ఆపై బోధిధర్ముడు నేర్పిన విద్యలకు చైనాలో పెద్ద విద్యాలయాలు ఉంటాయి.

ఇంతలా చైనాకు విద్య నేర్పిన మన భారతీయుడు గురించి మనలో చాలామందికి తెలియదనే ప్రశ్నను ఈ మూవీలో చూపించారు. ఆ తరువాత చైనాలో అధికారిక సమావేశంలో ఇండియాపై వారు తలపెట్టిన ఆపరేషన్ చూస్తే మనకు అంత దారుణంగా ఉంటుందా? అనిపిస్తుంది. 7th సెన్స్ మూవీలో వైరస్ ఒక కుక్కకు ఇంజెక్టు చేయబడుతుంది. ఆకుక్క నుండి మరొక కుక్కకు, పెంపుడు కుక్క అక్కడి నుండి మనుషులకు అంటువ్యాధి మహమ్మారి మాదిరి వ్యాప్తి చెందుతుంది.

వేలాది మంది అసుపత్రిపాలు అవుతూ ఉంటారు. ఇతనిని ఆపడానికి ఆనాటి బోధిధర్ముడిని జన్యుపద్దతిలో మరలా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది, జనటిక్ సైంటిస్ట్. ఆమె ప్రయత్నాలు ఫలించాయా లేదా? బోధిధర్ముడు ఆ చైనీయుడిని అంతం చేయడానికి మరలా వచ్చాడా? మూవీ చూడాలి… చూస్తుంటే ఆసక్తిగా సాగుతుంది.

ఇప్పుడు వైరస్ చైనాలో కరోనా వైరస్ తొలిమరణం సంభవించింది. ఈ మూవీలోనూ చైనీయులే బయోవార్ కు తెరతీసినట్టుగా చూపించడం విశేషం. నేడు జరుగుతున్నది మూవీలో ఉన్నట్టే కాదు. కానీ ఈ మూవీ 7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా… తీసినట్టుగా ఉన్నట్టు అనిపించకపోదు.

ధన్యవాదాలు – మూవీమిత్ర.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *