EverydayIsAFestival ప్రతిరోజూ పండగే

EverydayIsAFestival ప్రతిరోజూ పండగే

EverydayIsAFestival ప్రతిరోజూ పండగే. కాలాన్ని కేవలం క్యాష్ కోసమే ఖర్చు పెట్టే ఒక జనరేషన్ పై అంతకుముందు ఉన్న జనరేషన్, ఆతర్వాతి జనరేషన్ ఎలా స్పందించారో అదే ప్రతిరోజూ పండగే మూవీ.

ఎమోషన్స్ బిజినెస్ చేసి క్యాష్ చేసుకునే ఒక తరం అక్కడక్కడా సమాజంలో కనబడితే, అటువంటి తరంలోని వారికి జన్మనిచ్చిన ఒక తండ్రి మరణానాకి దగ్గరగా ఉంటాడు. అతనిని చూడడానికి ఫారిన్ రావడానికి ఖర్చు అధికంగా ఉంటుంది. తీరా చనిపోతాడు అని వచ్చాక, ఆ తండ్రి బ్రతికితే ఎలా? కాలం వృధా అయిపోతుంది. కాబట్టి అతని మరణం కన్ఫర్మ్ చేయమని డాక్టరుని రిక్వెస్ట్ చేసే పెద్దకొడుకు, ఆ పెద్ద కొడుకు ప్లానింగులో తమ బిజి లైఫ్ త్యాగం చేయడానికి ఆలోచించే అతని సోదర సోదరిమణులు.

తన సంతానం మనస్తత్వాలు ఎరిగిన ఆ తండ్రి, వారి నుండి ఏం ఆశించినా? అది వారి నుండి రాదని తెలిసి, మరణం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే అతని మనవడు మాత్రం తాతగారి చివరి రోజులను ప్రతిరోజూ పండగే లాగా మార్చేయాలనుకుంటాడు. అదే ఈ మూవీ కధాంశం.

ప్రతిరోజూ పండగే తెలుగు మూవీ డిసెంబరు 20, 2019 తేదిన విడుదలైంది. ఈ తెలుగమూవీకి దాసరి మారుతి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, విజయకుమార్, విజయ నరేష్, ప్రభ, మురళీ శర్మ, అజయ్, హరితేజ, సత్యం రాజేష్, భరత్ రెడ్డి, ప్రవీణ్, సుహాస్, మహేష్ ఆచంట తదితరులు నటించారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈమూవీకి ఎస్. తమన్ సంగీతం అందించారు.

EverydayIsAFestival ప్రతిరోజూ పండగే కధాంశం మనసును కదిలించే విషయం

EverydayIsAFestival ప్రతిరోజూ పండగే మూవీ
EverydayIsAFestival ప్రతిరోజూ పండగే మూవీ

ఈ మూవీ EverydayIsAFestival ప్రతిరోజూ పండగే కధాంశం మనసును కదిలించే విషయం. రఘురామయ్య(సత్యరాజ్) గారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు వారికి పెళ్ళిళ్ళు అయ్యి వారికి పిల్లలు కూడా ఉంటారు. అయితే ఆనందదాయకమైన బంధాలన్నీ రఘురామయ్యగారికి విమానయానం చేయాల్సిన దూరంలో ఉంటారు.

ఒక్కడే ఉండే రఘురామయ్యగారికి మరణానికి రోజులు గడువు చెబుతాడు, డాక్టరు. అదేవిషయం ఫారిన్లో ఉన్న తన సంతానానికి తెలియజేస్తాడు, రఘురామయ్య. అతని పెద్దకొడుకు ఆనందరావు(రావు రమేష్), అతని సోదరీ, సోదరులతో కాన్పిరెన్స్ కాల్ మాట్లాడి, అంతా కలిసి తమ తండ్రి చివరి రోజలకు దగ్గర ఉండి కొంత సమయం కేటాయించుకుని సమయం ప్లాన్ చేసుకుంటారు. ఆనందరావుకు ఒక కొడుకు పేరు తేజ్ (సాయిధరమ్ తేజ్).

ఆనందరావు తన కొడుకును వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు. తనకోసం తన కొడుకు స్నేహితులను కలవనీయడు. అటువంటి తేజ్ కు తాత రఘురామయ్యకు చివరి రోజులు అనే విషయం తెలవగానే, తాతగారి దగ్గరకు వచ్చేస్తాడు. తాత దగ్గరకు వచ్చేసిన తేజ్, తాత కోసం తాతగారి తీరని కోరికలు ఏమేవి ఉన్నాయో అవి చేసేస్తూ ఉంటాడు. రఘురామయ్యగారికి, అతని స్నేహితుడు సూర్యనారయణకు మద్య వచ్చిన అపార్ధం తొలగించేస్తాడు.

అలా తాత చేయాలనుకున్న ప్రతి పనిని చేసేస్తూ ప్రతిరోజూ పండగే అన్నట్టు రోజులను ఆనందదాయకంగా మారుస్తాడు. అందులో భాగంగానే తాత కోసం, తాత స్నేహితుడి కూతరు ఏంజెల్ ఆర్న(రాశిఖన్నా)ని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకుంటాడు. ఆనందరావు కొడుకు పెళ్ళి దామోదర్(మురళీశర్మ) కూతురితో నిశ్చయం చేసేస్తాడు.

ఇక తాతన దగ్గరకు ఫారిన్లో ఉన్నవారిని రప్పించడానికి తన పెళ్ళికోసం ఏంజెల్ ఆర్న ఫ్యామిలితో మాట్లాడుతాడు. తన పెళ్ళి నిశ్చయం అయ్యిందని, తన తండ్రికి, బాబయికి, మేనత్తకు అందరికీ తెలియజేసి, అందరిని తాతగారింటికి వచ్చేలా చేస్తాడు.

తేజ్ తీసుకువచ్చిన వాతావరణంతో రఘురామయ్యగారి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇంకా కొన్నివారాలపాటు రఘురామయ్యగారు బ్రతికే ఉంటారని డాక్టర్ చెబుతాడు. రోజులు లెక్కపెట్టుకుని వచ్చిన రఘురామయ్య పిల్లలకు ఇవి పెద్ద షాక్. ఆ తర్వాత వారి తిరిగి వెళ్ళి పోవాలనుకోవడం, తేజ్ వారిని ఆపే ప్రయత్నం చేయడం. చివరికి ఏమయ్యింది? మూవీ చూస్తేనే బాగుంటుంది.

బంధాలు విలువలు కోసం చూసేవి కొన్ని అయితే కాలిక్యులేటెడ్ గా ఆలోచించేవి మరికొన్ని వాటి మద్య ఏర్పడే సన్నివేశాలను కామెడి ప్రయత్నంగా మారుతి ఈ మూవీని మలిచారు. సత్యరాజ్, రావురమేష్ పాత్రల మలిచిన తీరు బాగుంటే, మూవీ క్రైమాక్స్ అంత బలంగా లేకపోయినా మూవీ ఒకసారి చూడడానికి బాగానే ఉంటుంది.

బంధానికి, బిజినెస్ కు ముడి పెట్టుకుని కాలం కేవలం క్యాష్ పెంచుకోవడానికి అని ఆలోచించేవారికి, క్యాష్ కాదు ముఖ్యం బంధమే ముఖ్యం అని తలచే తరం ఉంటే ఎలా ఉంటుందో ఈ ప్రతిరోజూ పండగే చూపిస్తుంది. పోయే ప్రాణానికి కావాల్సిన ఓదార్పు ధైర్యం ఆప్తుల ఓదార్పు, ఆప్తుల అనుబంధం అయితే చివరిరోజులలో వాటిని తన తాతకు దక్కేలా చేసిన మనవడి ప్రయత్నం ఈ మూవీ.

ఎంచుకున్న కధ బాగుంది. కుటుంబ కధలు ఎక్కడో ఏదో మూల సమాజంలో చోటుచేసుకున్నట్టుగా ఉండి, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఆవిధంగానే ప్రతిరోజూ పండగే తెలుగు మూవీ కూడా ఉంటుంది.

ధన్యవాదాలు

ధియేటర్లలో కాదు యూట్యూబ్ ద్వారా మూవీస్ చూసేవారికి

అందరూ సినిమా హాలుకు వెళ్ళి చూడకపోవచ్చును, కానీ యూట్యూబ్ లో వచ్చాక చూద్దాం అనుకునేవారికి మూవీమిత్ర ద్వారా పాత మూవీస్ గురించి క్లుప్త వివరణ అందిద్దామనే ఉద్దేశ్యంతో… ఈ పోస్టు ! EverydayIsAFestival ప్రతిరోజూ పండగే మూవీ యూట్యూబ్ లో ఇంకా అప్ లోడ్ అవ్వలేదు. అధికారిక చానల్ ఏదైనా అప్డేట్ చేసి ఉంటే ఆ లింకు ఈ పోస్టులో తర్వాత ఎంబెడ్ చేయబడుతుంది. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *