Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.

Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.

Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన సినిమా. యవ్వనవతి అంగాంగ ప్రదర్శలు ఏకాంతంగా చూడడానికి బాగుండవచ్చును. కానీ బంధువర్గంతో అందులోనూ పిల్లలతో కలిసి చూడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం కుటుంబసమేంతంగా చూడదగిన సినిమాలుగా ఉంటాయి. అలాంటి కోవలోకే Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.

మధు(జగపతిబాబు) సివిల్ ఇంజనీరుగా ఓ భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తుంటాడు. మధు, రాధ ఇద్దరూ భార్యభర్తలు. కానీ రాధకు సోకుల మీద మోజు ఎక్కువ. అయితే సాధారణంగా స్త్రీలకు బంగారం, వస్తువుల కొనుగోలు చేయడంలో మోజు ఉంటుంది. కానీ రాధకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికోసం భర్తను అడుగుతూనే అతనికి సహకరిస్తూ సంసారం సాగిస్తుంది. కానీ మధుకి సాధారణ జీవితం తృప్తిగా గడపడం ఇష్టంగా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో విలాసమైన వస్తువులు కొనాలని కోరుకుంటూ రాధ అనుకుంటుంది. పెద్ద బంగ్లాలో ఉండాలని ఆశిస్తూ ఉంటుంది. వీరికి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉంటారు.

Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.
Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.

మధు పనిచేసే కనస్ట్రక్షన్ కంపెనీ బాస్ కు ఒక కూతురు లత విదేశాల్లో ఉంటుంది. ఆమె అక్కడ చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తుంది. లత మధును చూసి, ఇష్టపడుతుంది. అతని గురించి తెలియకుండానే అతనిపై అనురాగం పెంచుకుంటుంది. అయితే మధు మాత్రం లతన ఆ కోణంలో ఎప్పుడూ చూసి ఉండడు. ఇంకా తర్వాత అతనికి పెళ్ళైందని లతకు తెలుస్తుంది. అయినా ఆమె అతనిపై వ్యామోహంతో ఉండి, అతనినే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. లత తన కోరికను తండ్రికి చెబుతుంది. తండ్రి ఆమెకు చివాట్లు పెడతాడు. అయినా ఆమె తండ్రి మాట వినకుండా తన ప్రయత్నాలు చేస్తుంది. మధు కూడా ఆమె కోరికను కాదనే అంటాడు.

అయితే రాధకు డబ్బాశ ఉందని లత పసిగడుతుంది. లత రాధతో మధుని బేరం పెడుతుంది. కోటి రూపాయిలు డబ్బు ఎరగా వేసి, మధుని తనకిచ్చి వివాహం చేయమని రాధని లత ప్రాధేయబడుతుంది. మొదట్లో లతపై మండిపడ్డ రాధ, కోటిరూపాయిలు అనేటప్పటికీ ఆలోచనలో పడుతుంది. ఆమెకు డబ్బు మోహం కప్పుతుంది. భర్తను మరొక వ్యామోహికి అప్పగిస్తుంది. అయితే తన కోరిక తీరిన లత, మధుని ప్రేమగా చూసుకుంటుంది. రాధ డబ్బును ప్రేమగా చూసుకుంటుంది. డబ్బువ్యామోహంలో రాధ పిల్లలను కూడా అశ్రద్ధ చేస్తుంది. మధుపై కోరిక, ప్రేమగా మలుచుకున్న లత, రాధ పిల్లలకు కూడా దగ్గరవుతుంది. ఒక నాటికి రాధకు భర్త, పిల్లలు తనకుకాకుండా పోతున్నారనే భావన బలపడుతుంది. అంతే ఆమె మోహం విడిపోతుంది. కానీ ఆమె చేసిన తప్పు, ఆమెను చిత్రవధ చేస్తుంది. చివరు లత విదేశాలకు వెళ్తూ, మధుని, పిల్లలని రాధకు అప్పగించేస్తుంది.

Shubha lagnam family entertainer justice family values

ఒక వ్యక్తికి ఉన్న కోరిక బలపడడానికి ఏదో ఒక బంధం కారణంగా కనబడుతుంది. అలా రాధ అత్యాశకు కారణంగా ఆమె స్నేహితురాలు మీనా కారణంగా కనబడుతుంది. ఈ మూవీలో రాధ రోడ్డు మీద నడుస్తూ వస్తుంటే, ఆమె ప్రక్కనే ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆకారులోంచి రాధ స్నేహితురాలు మీనా దిగుతుంది. మీనా రాధని పలకరిస్తుంది, రాధ కూడా మీనాని పలకరిస్తుంది. ఇద్దరూ కారు ఎక్కి బయలుదేరతారు. అయితే మీనా తన గురించి చెబుతుంది. మీనా రాధను ఇంటి దగ్గర దింపుతాను అనగానే రాధ మనసులో ఆలోచన మొదలవుతుంది.

మీనా బాగా డబ్బు కలిగి ఉందని రాధకు అర్ధం అవుతుంది. అయితే మీనా ముందు తన ఒక మద్యతరగతి స్త్రీగా పరిచయం చేసుకుంటే, ఆమెకు నాపై చులకన భావం ఏర్పడుతుందని రాధ భావిస్తుంది. అలా వెళ్తున్న కారులో రాధ ఒకఇంటి ముందు కారు ఆపించి, అదే తాము ఉంటున్న ఇల్లు అని చెబుతుంది. అయితే అది మీనా ఇల్లు. మీనా వెంటనే రాధకు క్లాసు తీసుకుంటుంది. రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ కారణంగా రాధకు ఎలాగైనా ధనవంతులం కావాలనే తలంపు మరింతగా పెరుగుతుంది. లత చూపించిన ఆశకు వెలకట్టలేని భర్త ప్రేమ కూడా రాధకు చిన్నగా కనబడతాయి. ఆమెకు కోటి రూపాయిలు పెద్ద మొత్తంగా అనిపించి, కేవలం భర్తను షేర్ చేసుకోవడం మాత్రమే అని ఆలోచనతో లత ఆఫర్ అంగీకరిస్తుంది. అప్పుడు ఆమెకు అంతా వద్దనే చెబుతారు. కానీ ఎవరి మాట వినదు.

Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.
Shubha lagnam family entertainer ఇద్దరి ఆడువారి కోరికలకు అద్దం పట్టిన శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.

ఇద్దరి ఆడువారి కోరికలకు మద్యన నలిగే పాత్రలో మధు పాత్ర ఉంటుంది. స్త్రీకి ఇల్లాలి పదవిని మించిన ఆస్తి ఉండదని, అంతకన్నా విలువైనది ఏది ఉండదని ప్రాక్టికల్ గా ఈ మూవీ నిరూపిస్తుంది. పెళ్ళైన మగాడిపై మోజుపడితే, చివరకు ఒంటరిగా ఉండక తప్పదు. కానీ ఈమూవీలో లత విదేశాలకు వెళ్తున్న త్యాగమూర్తిగా మారిపోతుంది. అయితే రాధ తప్పిదం వలన లత పాడుకోరిక ప్రేమగా కనబడుతుంది. కానీ కేవలం డబ్బు మీద ఆశ అయితే ఉంది కానీ భర్త అన్నా, పిల్లలన్నా రాధకు మిక్కిలి ప్రేమ… కాకపోతే క్యాష్ దానిని కప్పిపెట్టి ఉంచడంతో వారు దగ్గరగా ఉన్నన్నాళ్ళు ఆమె మనసు ధనవంతులుగా ఉండాలనే కోరికతో కాలుతుంది. చివరకు తన విలువైన ఆస్తి దూరం అవుతుంటే తప్పు తెలుసుకుంటుంది. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టుగా రాధ పరిస్థితి మారుతుంది. చివరలో ఆమె చిత్రవధ మాత్రం ప్రతి ఇల్లాలికి జాగురతను గుర్తుకు తెస్తుంది. సకుంటంబ సపరివారంగా చూడదగిన తెలుగు మూవీలలో Shubha lagnam family entertainer శుభ లగ్నం మంచి మెసేజింగ్ మూవీ.. ఇంకా ఈ మూవీలో ఏవిఎస్, బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి..

మధుగా – జగపతిబాబు, రాధగా – ఆమని, లతగా – రోజా, లత తండ్రిగా – సుబ్బారాయశర్మ, రాధ తల్లిండ్రులుగా అన్నపూర్ణ, కోట శ్రీనివాసరావులు నటించారు.

Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *