రెడీ

తెలుగు దర్శకుడు శ్రీనువైట్ల యాక్షన్, కామెడిని మిక్స్ చేసి మూవీస్ తీయడంలో దిట్ట. అది అగ్రహీరో అయినా చిన్న హీరో అయినా కామెడి, యాక్షన్ రెండూ ఉండి ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఇలా రామ్ తెరకెక్కించిన తెలుగుమూవీ రెడీ అదే కోవలోకి వస్తుంది.

స్రవంతి రవికిషోర్ నిర్మించిన రెడీ తెలుగుమూవీలో రామ్, జెనిలీయ డిసౌజా, సునీల్, చంద్రమోహన్, నాజర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరని, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, విద్య తదితరులు నటించారు.

రఘుపతి (నాజర్), రాఘవ(తనికెళ్ళ భరణి), రాజారాం(వెంకట గిరిదర్) ముగ్గురు అన్నదమ్ములు. వారికి స్వరాజ్యం(రజిత) చెల్లెలు, ఆ చెల్లెలి స్వరాజ్య భర్త (చంద్రమోహన్), అతను ఇల్లరికం వచ్చి రఘుపతి ఫ్యామిలిలోనే ఉంటాడు. రఘుపతి తమ్ముడు రాఘవ సుపుత్రుడు చందు (రామ్). చందు మరదల స్వప్నకు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుండగా, ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేకపోడంతో, ఆమె ప్రేమించిన వ్యక్తి(నవదీప్) వద్దకు ఆమెను చేరుస్తాడు. పెళ్లి చెడగొట్టినందుకు రఘపతి చందుని ఇంటి నుండి వెళ్లగొడతాడు.

ఆ తర్వాత చందు తన స్నేహితుడు ప్రియురాలికి పెళ్లి జరుగుతుంటే, ఆమెను కిడ్నాప్ చేయబోయే వేరే పెళ్ళికూతురు పూజని కిడ్నాప్ చేస్తాడు. పూజ కూడా తనకు ఇష్టంలేని పెళ్లి నుండి తప్పించుకోవాలనకుని, అనుకోకుండా ఇలా కిడ్నాప్ అవ్వడంతో, ఆమె చందు ఇంట్లో ఉంటుంది. చందు కూడా రఘుపతి అనుమతితో మరలా ఇంట్లోకి చేరతాడు. ఆ ఇంట్లో వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి పూజ మేనమామల కొడుకులు ఇద్దరూ ఎదురుచూస్తూ ఉంటారు. పూజ కోసం గాలిస్తూ ఉంటారు.

పూజ తన మేనమామల దగ్గరకు వెళ్లవలసి రావడంతో, చందు పూజకోసం వారి మేనమామల ఇంట్లోకి, వారిద్దరికీ జాయింట్ ఎక్కౌంటెంటు (బ్రహ్మానందం) ద్వారా చేరతాడు. చివరికి పూజ ఇద్దరి మేనమామల అంగీకారంతో పూజని చందు వివాహం చేసుకుంటాడు.

ఈ రెడీ మూవీ కామెడితో సరదాగా సాగిపోతుంది.

రెడీ తెలుగు కామెడీ ఎంటర్ టైనర్ మూవీ

ధన్యవాదాలు – మూవీమిత్ర

Add a Comment

Your email address will not be published. Required fields are marked *