మాటలు కోటలు దాటడం అంటే ఏమిటో ఈ పిట్టలదొర తెలుగుమూవీలో హీరో క్యారెక్టర్లో చూడవచ్చును. ఈమూవీలో కమెడియన్ ఆలీ హీరోగా నటించగా, అతనికి జోడిగా ఇంద్రజ నటించింది. ఈ తెలుగుకామెడిమూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. పిట్టలదొర కామెడి మిత్రునివలే తెలుగుమూవీ కి సానాయదిరెడ్డి డైరక్షన్ చేశారు. బొంబాయి మూవీలోని హమ్మా..హమ్మా సాంగుకు బాబుమోహన్ పేరడి సాంగుగా ఈ మూవీలో స్పెషల్ ఎట్రాక్షన్.
పిట్టలదొర తెలుగు కామెడి మూవీలో బాబుమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లిఖార్జునరావు పిఎల్ నారాయణ, తనికెళ్ల భరణి, చిన్నా, సుమిత్ర తదితరులు నటించారు.
డమ్మీ తుపాకి పట్టుకుని కబుర్లు చెబుతూ అందరిని మెప్పించే పిట్టలదొరగా ఆలీ నటించారు. ఒక పిసినారి కోటీశ్వరుడిగా కోట శ్రీనివాసరావు చక్కగా నటిస్తే, అతని చేత బాధింపడే పనివాడిగా బ్రహ్మానందం నటన హాస్యమును పండిస్తుంది.
పిసినారి కోటీశ్వరుడి ఇంటికి పిట్టలదొర చెల్లెల్ని ఇంటి కోడలుగా పంపడం ఈ